కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

ఇట్లు అర్జున విడుదల తేదీ ఖరారు

Itllu Arjuna Release Date Locked

ఇట్లు అర్జున విడుదల తేదీ ఖరారు

Itllu Arjuna Release Date Locked

Itllu Arjuna Release Date Locked

డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాతగా వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. ఈ సినిమాతో అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, డెబ్యూ దర్శకుడు మహేష్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్నారు. అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. టైటిల్ గ్లింప్స్, ఇప్పటికే విడుదలైన రెండు పాటలు, ఇతర ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచింది.

తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘ఇట్లు అర్జున’ అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. విడుదల తేదీని ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఆకట్టుకుంటోంది. పోస్టర్‌లో అనీష్ స్టైలిష్ లుక్‌లో ఓ భవనం పైకప్పు నుంచి దూకుతూ ఏదో పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుండగా, అనస్వర రాజన్ చేతులు కట్టబడి, విభిన్నమైన ఎక్స్‌ప్రెషన్‌తో కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. సినిమాకు ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌లో కనిపించిన లీడ్ పెయిర్ కెమిస్ట్రీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ చిత్రంలో అనీష్ చెవిటి మూగ యువకుడి పాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన ఈ ప్రత్యేకమైన నేపథ్యం కథలో ఆసక్తికరమైన అంశాన్ని యాడ్ చేస్తోంది. విడుదల తేదీ ఖరారు కావడంతో రాబోయే రోజుల్లో మరిన్ని ప్రమోషనల్ కంటెంట్‌ను విడుదల చేసి సినిమాపై మరింత బజ్‌ను పెంచేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది.

ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, రాజా మహాదేవ్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. రామ్ కుమార్ ఏ ప్రొడక్షన్ డిజైనర్‌గా, కోటి కే ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలకు దిలీప్ సుబ్బరాయన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్