వర్సటైల్ స్టార్ సూర్య, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ₹150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టిస్తోంది. సంజయ్ విశ్వనాథ్ పాత్రలో సూర్య తన పవర్‌ఫుల్ నటన, లుక్స్, ఎమోషన్స్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మమితా బైజు ఇందులో కథానాయికగా నటించగా , రవీనా టాండన్, సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రల్లో మెరిశారు. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం అదనపు బలాన్ని చేకూర్చింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ కలసి సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.
ముఖ్యంగా తమిళ్ కంటే తెలుగులో ఈసినిమా ఎక్కువ వసూళ్లను రాబట్టుకోవడం విశేషం. వర్కింగ్ డేస్ లోకూడా థియేటర్లు హౌస్‌ఫుల్ కలెక్షన్లతో కళకళలాడుతుండటంతో రానున్న రోజుల్లో ఈ చిత్రం మరిన్ని భారీ రికార్డులను నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.ఫుల్ రన్ లో ఈసినిమా 300కోట్ల మైలు రాయిని చేరుకొనేలానే వుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























