నాని – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది.’ఏషనాగుల గట్టు మీద’ అనే ప్రముఖ తెలంగాణ ఫోక్ సాంగ్ ను ఈ సినిమాలో ఒక స్పెషల్ మాస్ సాంగ్ కోసం ఉపయోగిస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ వార్తలపై ప్రముఖ గేయ రచయిత కాసర్ల శ్యామ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ పాట సినిమాలో ఉన్న మాట వాస్తవమే అని స్పష్టం చేస్తూనే, అందులోని లిరిక్స్ మాత్రం వేరేగా ఉంటాయని ఆయన క్లారిటీ ఇచ్చారు. సినిమా కథా నేపథ్యానికి, సన్నివేశానికి తగినట్లుగా సరికొత్త సాహిత్యంతో ఈ పాటను తీర్చిదిద్దుతున్నట్లు ఆయన తన ట్వీట్ ద్వారా వెల్లడించారు.
రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. తెలంగాణ జానపద బాణీకి అనిరుధ్ మార్క్ మాస్ బీట్స్, కాసర్ల శ్యామ్ పవర్‌ఫుల్ లిరిక్స్ తోడవుతుండటంతో ఈ స్పెషల్ సాంగ్ థియేటర్లలో రచ్చ చేయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























