సంక్రాంతి బరిలోకి చిరు మరోసారి

Chiranjeevi Back in the Sankranthi Race with Mega 158

మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం మెగా 158 (వర్కింగ్ టైటిల్ )పై సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తున్న ఈ చిత్రం 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే దాదాపు 40 రోజుల చిత్రీకరణ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ కూడా లాక్ అయినట్లు తెలుస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రత్యేక సెట్లలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ ‘కేవీఎన్ ప్రొడక్షన్స్’ అత్యంత గ్రాండ్‌గా, భారీ బడ్జెట్‌తో ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతికే వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ సాధించడంతో, ఇప్పుడు మళ్ళీ అదే పండగ సీజన్‌ను టార్గెట్ చేయడం మెగా అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి అధికారిక టైటిల్‌తో పాటు పవర్‌ఫుల్ టీజర్/గ్లింప్స్ విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. బాబీ మాస్ విజన్, మెగాస్టార్ క్రేజ్ తోడై వస్తున్న ఈ ప్రాజెక్ట్ సంక్రాంతి రేసులో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.