మాస్ మహారాజా రవితేజ, సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఇక ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 25 నిమిషాలుగా లాక్ అయినట్లు సమాచారం. ఎక్కడా బోర్ కొట్టకుండా క్రిస్పీ రన్టైమ్తో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో బాక్సాఫీస్ వద్ద మరో బ్లాక్‌బస్టర్ లోడింగ్ అని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ థ్రిల్లర్‌కు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహించారు. సాయి కుమార్, బేబీ నక్షత్ర తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.
అయ్యప్ప దీక్ష, ఫ్యామిలీ థ్రిల్లర్ మరియు అమ్మాయిల భద్రత అనే కీలకమైన అంశాలను మిళితం చేసి శివ నిర్వాణ ఈ కథను రూపొందించారు. ఇందులో తండ్రిగా, అయ్యప్ప భక్తుడిగా, మద్యానికి బానిసైన వ్యక్తిగా రవితేజ పాత్రలో ఎన్నో వేరియేషన్స్ ఉంటాయని తెలుస్తోంది. రవితేజ కెరీర్లోనే ఇది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ బ్లాక్స్ సర్ప్రైజింగ్గా ఉంటాయని, ఇటీవల విడుదలైన ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ ప్లేస్మెంట్ సినిమాకి ప్రధాన హైలైట్‌గా నిలువనుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























