రివ్యూ: విశ్వనాథ్ & సన్స్

Viswanath & Sons Movie Review

నటీనటులు: సూర్య, మమితా బైజు, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్, నాజర్ తదితరులు

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకత్వం: వెంకీ అట్లూరి

నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య

బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్

సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్

సినిమాటోగ్రఫీ: నిమిష్ రవి

వర్సటైల్ స్టార్ సూర్య, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన క్రేజీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. టీజర్, ట్రైలర్లతోనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచిన ఈ సినిమా ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

కథ:
సంజయ్ విశ్వనాథ్ (సూర్య) ఒక ప్రముఖ బిలియనీర్ మరియు ఆశయాలు ఉన్న వ్యక్తి. తండ్రి విశ్వనాథ్ (నాజర్) స్థాపించిన వ్యాపార సామ్రాజ్యాన్ని, కుటుంబ ఆదర్శాలను ప్రాణంగా భావిస్తుంటాడు. ఈ క్రమంలో ఆయన జీవితంలోకి చలాకీగా ఉండే అమ్మాయి (మమితా బైజు) ప్రవేశిస్తుంది. ఆమె రాకతో సంజయ్ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? వ్యాపారంలో ఎదురైన సవాళ్లను, కుటుంబంలో వచ్చే సమస్యలను సంజయ్ విశ్వనాథ్ ఎలా అధిగమించి విజయం సాధించాడు అనేదే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మిగితా కథ.

విశ్లేషణ:

దర్శకుడు వెంకీ అట్లూరి ఎంచుకున్న కథాంశం చాలా సరళంగా అనిపించినప్పటికీ, దానిని తెరపై ఆవిష్కరించిన తీరు ఎంతో ఆకట్టుకుంటుంది. వ్యాపార ప్రపంచంలోని పోటీని, కుటుంబం మధ్య ఉండే పవిత్రమైన బంధాలను సమతుల్యంగా మేళవించి కథనాన్ని ముందుకు నడిపించారు.

సినిమా ప్రారంభంలోనే సంజయ్ విశ్వనాథ్ పాత్ర, ఆయన వ్యాపార ప్రపంచాన్ని దర్శకుడు ఎంతో ఆసక్తికరంగా ఎస్టాబ్లిష్ చేశారు. ఫస్టాఫ్ అంతా చాలా కలర్‌ఫుల్‌గా, వేగవంతమైన కథనంతో సాగిపోతుంది. సూర్య మార్క్ రాయల్ క్లాసీ లుక్స్, మమితా బైజు పరిచయం మరియు వారిద్దరి మధ్య వచ్చే క్యూట్ లవ్ స్టోరీ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆహ్లాదపరుస్తాయి. మధ్యమధ్యలో వచ్చే లైట్ హార్టెడ్ కామెడీ , సూపర్బ్ పాటలు విజువల్ ట్రీట్‌గా నిలుస్తాయి. కథలో అసలైన మలుపు తెచ్చే పవర్‌ఫుల్ ఇంటర్వల్ బ్లాక్‌తో ప్రథమార్థం చాలా ఆసక్తికరంగా ముగుస్తుంది.

ఇక సెకండాఫ్‌లోకి అడుగుపెట్టగానే సినిమా ఎమోషనల్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరుగుతుంది. తండ్రీ-కొడుకుల అనుబంధం, కుటుంబానికి ఎదురయ్యే సవాళ్లను సంజయ్ ఎలా ఎదుర్కొన్నాడు అనే సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను తాకుతాయి. ముఖ్యంగా వ్యాపార ప్రపంచంలో వచ్చే కార్పొరేట్ డ్రామా మరియు ఫ్యామిలీ వాల్యూస్ మధ్య నడిచే సన్నివేశాలను వెంకీ అట్లూరి చాలా పకడ్బందీగా డిజైన్ చేశారు. సెకండాఫ్‌లో వచ్చే రెండు ప్రధాన ఎమోషనల్ ఎపిసోడ్స్ థియేటర్‌లో ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడతాయి. క్లైమాక్స్ ఎపిసోడ్‌ను ఎంతో హుందగా, ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ముగించడం సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్.

నటీనటుల పనితీరు:

సూర్య: తన నటనా విశ్వరూపంతో సినిమాను వన్ మ్యాన్ షోలా నడిపించారు. సంజయ్ విశ్వనాథ్ పాత్రలో ఆయన చూపించిన రాయల్ లుక్స్, గ్రేస్ అద్భుతం. క్లాస్ అండ్ ఎమోషనల్ సీన్స్‌లో ఆయన పెర్ఫార్మెన్స్ ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తుంది.

మమితా బైజు: తన పాత్రలో ఎంతో ఎనర్జెటిక్‌గా కనిపిస్తూ, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంది. సూర్యతో ఆమె కెమిస్ట్రీ చాలా ఫ్రెష్‌గా వర్కవుట్ అయ్యింది.

ఇతర నటీనటులు: సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్, నాజర్, రవీనా టాండన్ తమ అనుభవంతో కథలోని ఎమోషనల్ సీన్స్‌కి మరింత బలాన్ని చేకూర్చారు.

సాంకేతిక విభాగం:

దర్శకత్వం: వెంకీ అట్లూరి మరొకసారి తన బలాన్ని నిరూపించుకున్నారు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు హృదయానికి హత్తుకునే సంభాషణలు (డైలాగ్స్) అందించారు. కథనాన్ని నడిపించిన తీరు ప్రథమార్థం నుండి క్లైమాక్స్ వరకు చాలా ఆకట్టుకుంటుంది.

సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి సన్నివేశాన్ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లింది.

సినిమాటోగ్రఫీ & నిర్మాణ విలువలు: నిమిష్ రవి కెమెరా పనితనం విజువల్స్‌ని ఎంతో రిచ్‌గా చూపించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ విలువలు టాప్ నాచ్ అనిపిస్తాయి.నాగవంశీ ఈసినిమాను ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు.

ఓవరాల్ గా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం కుటుంబ సమేతంగా చూడదగ్గ ఒక అద్భుతమైన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. సూర్య వన్ మ్యాన్ షో, వెంకీ అట్లూరి టేకింగ్ ఈ సినిమాను బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలిపాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.