స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్‌లో గౌరీ హెగ్డేగా టబు … గ్లింప్స్ విడుదల

Tabu’s Glimpse from SlumDog – 33 Temple Road Released

డైరెక్టర్ పూరి జగన్నాథ్, ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి తొలిసారి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్లమ్ డాగ్ – 33 టెంపుల్ రోడ్’ . ఈ చిత్రం నుండి బాలీవుడ్ అగ్రనటి, వర్సటైల్ యాక్ట్రెస్ టబు క్యారెక్టర్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాలో టబు ‘గౌరీ హెగ్డే’ అనే పవర్‌ఫుల్ అండ్ ఫియర్‌లెస్ ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.పూరి జగన్నాథ్ మార్క్ ఆటిట్యూడ్‌తో టబు రగ్గడ్ అండ్ మాస్ అవతార్‌ను ఈ గ్లింప్స్‌లో ఆవిష్కరించారు. “మా ఓల్డ్ సిటీలో ముందు కాలుస్తాం.. తర్వాత మాట్లాడతాం” అనే రఫ్ డైలాగ్‌తో ఆమె కనిపించిన విధానం సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటోంది.

పూరి కనెక్ట్స్, జెబి మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తుండగా, దునియా విజయ్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషలలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

విజయ్ సేతుపతి, టబుల మధ్య జరిగే పవర్‌ఫుల్ మైండ్ గేమ్ మరియు యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని గ్లింప్స్ స్పష్టం చేస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.