హృదయం మురళి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Hrudayam Murali OTT Release Date Locked

అథర్వ మురళి కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ ఫీల్ గుడ్ అండ్ ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా ‘హృదయం మురళి’. ఆకాష్ భాస్కరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ ప్రదర్శన తేదీని అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు 7 నుంచి ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

అథర్వ మురళి సరసన ప్రీతి ముఖుందన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించగా.. ఫహాద్ ఫాజిల్ ప్రత్యేక పాత్రలో మెరిశారు.ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఎస్ ఈ చిత్రానికి స్వరాలు అందించడమే కాకుండా, చాలా ఏళ్ల తర్వాత సినిమాలో ఓ ముఖ్య పాత్రలోనూ నటించడం విశేషం.

తమన్ ఐకానిక్ మ్యూజిక్, దిల్ ఖుష్ చేసే లవ్ అండ్ ఫ్రెండ్‌షిప్ ఎమోషన్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో మంచి ప్రశంసలు అందుకుంది.థియేటర్లలో మిస్ అయిన ప్రేమికులు, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ వారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ హార్ట్ టచింగ్ మూవీని వీక్షించవచ్చు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.