‘బేబి’ లాంటి కల్ట్ బ్లాక్‌బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ మరియు వైష్ణవి చైతన్య కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ థియేట్రికల్ రిలీజ్ డేట్ లాక్ అయ్యింది. ఈ చిత్రాన్ని 2026 సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొత్త పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
#90s – ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్‌తో ఆకట్టుకున్న ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆ సిరీస్‌లోని రోహన్ పాత్ర పెద్దయ్యాక యూఎస్ వెళ్ళిన తర్వాత జరిగే కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి హెషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు.
ముఖ్యంగా ‘బేబి’ జోడీ మళ్లీ రిపీట్ అవుతుండటంతో పాటు పోస్టర్లలో వీరి కెమిస్ట్రీ కలర్ఫుల్గా కనిపించడంతో ఈ సినిమాపై యువతలో మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























