గోపీచంద్ 25 ఏళ్ల ప్రస్థానం: తొలి వలపు నుంచి నేటి వరకు అన్‌స్టాపబుల్ జర్నీ

25 Years of Gopichand From Tholi Valapu to Stardom

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి విజయవంతంగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 2001లో సరిగ్గా ఇదే రోజున ఆయన కథానాయకుడిగా పరిచయమైన తొలి చిత్రం ‘తొలి వలపు’ విడుదల కావడం విశేషం. పాతికేళ్ల ఈ సుదీర్ఘ సినీ ప్రయాణంలో తనదైన శైలి నటన, విలక్షణమైన పాత్రలతో టాలీవుడ్‌లో ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కథానాయకుడిగా ‘తొలి వలపు’తో ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత గోపీచంద్ ఎంచుకున్న దారి టాలీవుడ్ చరిత్రలోనే చాలా ప్రత్యేకమైనది. ‘జయం’, ‘నిజం’, ‘వర్షం’ చిత్రాల్లో ఆయన ప్రదర్శించిన నెగెటివ్ పాత్రలు బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ‘జయం’లో “నచ్చేవరకు ఫ్రెండ్షిప్.. నచ్చాక విలన్షిప్” అంటూ ఆయన చెప్పిన డైలాగ్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్.

ఆ తర్వాత ‘యజ్ఞం’ చిత్రంతో మళ్లీ హీరోగా రీ-ఎంట్రీ ఇచ్చి తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. ‘రణం’, ‘లక్ష్యం’, ‘శౌర్యం’, ‘సాహసం’, ‘లౌక్యం’ వంటి చిత్రాలతో మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు.

ఏదైనా పాత్ర ఇచ్చినా దానికి వందకి వంద శాతం న్యాయం చేసే గోపీచంద్, 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అటు ఇండస్ట్రీ ప్రముఖులు, ఇటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ప్రస్తుతం గోపిచంద్, సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో భరతవర్ష అలాగే ఫైట్ మాస్టర్ వెంకట్ దర్శకత్వంలో సింగా అనే సినిమాలు చేస్తున్నాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.