మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘కొరియన్ కనకరాజు’. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, కిమ్చి కారమ్ టీజర్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకోగా.. తాజాగా మేకర్స్ ఈ చిత్ర ఫుల్ ట్రైలర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు.ఈ చిత్రం ట్రైలర్‌ను ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక కుర్రాడికి (వరుణ్ తేజ్) కొరియన్ ఆత్మ పడితే ఏమవుతుంది? అనంతపురం స్లాంగ్ మరియు కొరియన్ లాంగ్వేజ్ కలగలిపి ఆయన చేసే హంగామా చుట్టూ ఈ సినిమా సాగనుంది.ఇందులో వరుణ్ తేజ్ క్లోజ్ ఫ్రెండ్‌గా, ఫోటోగ్రాఫర్ పాత్రలో కమెడియన్ సత్య అలరించనుండగా.. రితికా నాయక్ కథానాయికగా నటించింది.
యువీ క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.ఆగస్టు 7న థియేటర్లలోకి రానున్న ఈ వినూత్న హారర్ కామెడీ చిత్రంపై రేపు విడుదల కాబోతున్న ట్రైలర్‌తో అంచనాలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























