రాజు వెడ్స్ రాంబాయి దర్శకుడితో సినిమా చేస్తున్న సుమంత్ ప్రభాస్

Sumanth Prabhas Joins Hands with the Raju Weds Rambai Director

ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగాల్లో అగ్ర సంస్థగా కొనసాగుతున్న శ్రీవెంకటేశ్వర సినిమాస్ తమ ప్రతిష్టాత్మక ప్రొడక్షన్ నెం.10ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. పూస్కూర్ రామ్ మోహన్ రావు, భరత్ నారంగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ‘రాజు వెడ్స్ రాంబాయి’తో దర్శకుడిగా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న శ్రీ సాయిలు కంపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వరుస ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ ఇందులో హీరోగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమా నేడు హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ గణేష్ టెంపుల్‌లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. సదానంద్ మేకర్స్‌కు  స్క్రిప్ట్‌ను అందించగా, దర్శకుడు శేఖర్ కమ్ముల ముహూర్తపు షాట్‌కు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. హీరో అడివి శేష్ క్లాప్ కొట్టగా, తొలి షాట్‌ను దర్శకుడు శ్రీ సాయిలుకంపాటి డైరెక్ట్ చేశారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

దర్శకుడిగా తన రెండో సినిమాతో శ్రీ సాయిలు కంపాటి రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్ కలిసిన ఓ హార్ట్‌వార్మింగ్ రస్టిక్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నారు. స్మాల్ టౌన్  నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రేమకథతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌కు మంచి ప్రాధాన్యం ఉంటుంది. సుమంత్ ప్రభాస్ తన ఎనర్జీకి తగ్గ ఫుల్ ఎంటర్‌టైనింగ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు.మిగతా నటీనటులు, టెక్నికల్ టీమ్‌తో పాటు సినిమా గురించి మరిన్ని వివరాలను త్వరలోనే మేకర్స్ వెల్లడించనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.