ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డును గెలుపొందిన 35 – చిన్న కథ కాదు

35 – Chinna Katha Kaadu’ Wins National Award for Best Children's Film

72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024 సంవత్సరానికి గాను ’35 – చిన్న కథ కాదు’ ఉత్తమ బాలల చిత్రం విభాగంలో జాతీయ పురస్కారానికి ఎంపికైంది. అలాగే ఈ చిత్రంలో నటించిన అరుణ్‌దేవ్ పోతుల ఉత్తమ బాల నటుడు విభాగంలో జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

2024లో విడుదలైన ’35 – చిన్న కథ కాదు’ చిత్రంలో నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్ ప్రధాన పాత్రలు పోషించారు. నందకిశోర్ ఈమాని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సృజన యర్రబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు. విడుదల సమయంలో ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం, ఇప్పుడు జాతీయ చలనచిత్ర పురస్కారాల్లోనూ తన సత్తా చాటింది.

మరో విశేషం ఏమిటంటే… గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ‘బాల రామాయణం’ (1996) తర్వాత దాదాపు మూడు దశాబ్దాల అనంతరం తెలుగు సినిమా ఉత్తమ బాలల చిత్రం విభాగంలో జాతీయ అవార్డుకు ఎంపిక కావడంవిశేషం. ఆ అరుదైన ఘనతను ’35 – చిన్న కథ కాదు’ సొంతం చేసుకోవడం తెలుగు చిత్రసీమకు గర్వకారణంగా నిలిచింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x


మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.