పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ‘సీతారామం’ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’. “అజ్ఞాతపర్వం ముగిసింది.. తిరుగుబాటు ప్రారంభమైంది” అంటూ చిత్ర యూనిట్ ఒక పవర్ఫుల్ అఫీషియల్ పోస్టర్‌ను విడుదల చేస్తూ మోస్ట్ అవైటెడ్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ భారీ చారిత్రక యుద్ధ చిత్రం రాబోయే డిసెంబర్ 3, 2026 న ప్రపంచవ్యాప్తంగా అత్యంత గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతోంది. విడుదల చేసిన కొత్త పోస్టర్లో ప్రభాస్ రక్తం మరియు గాయాలతో, చేతిలో తుపాకీ పట్టుకుని యుద్ధభూమిలో ఒక బండరాయిపై కూర్చుని ఉన్న రగ్గడ్ అండ్ ఇంటెన్స్ లుక్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. “ఒంటరిగా పోరాడే ఒక బెటాలియన్” అనే ట్యాగ్‌లైన్‌తో 1930-40ల నాటి చారిత్రక, స్వాతంత్ర ఉద్యమ నేపథ్యం చుట్టూ ఈ కథ తిరగనుందని పోస్టర్ ద్వారా క్లియర్‌గా అర్థమవుతోంది.
ఈ చిత్రంలో ప్రభాస్ సరసన సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వీ హీరోయిన్గా పరిచయమవుతుండగా, బాలీవుడ్ లెజెండ్స్ మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ మరియు జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మరియు టి-సిరీస్ ఫిలిమ్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో, ప్రతిష్టాత్మక నిర్మాణ విలువలతో ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. సుదీప్ ఛటర్జీ అద్భుతమైన విజువల్స్ అందిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి ఆకట్టుకునే క్లాసికల్ అండ్ ఇంటెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం మరియు బెంగాలీ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























