వదలా కాన్సెప్ట్, కథ చాలా కొత్తగా అనిపించింది –  అనిల్ రావిపూడి 

Vadala Stands Out with Its Fresh Storyline Says Anil Ravipudi

చరిత చిత్ర బ్యానర్ మీద కిషోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ సంయుక్తంగా నర్మించిన చిత్రం ‘వదలా’. జగపతి బాబు, లయ, హృతిక శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో ఆకెళ్ల వి కృష్ణ ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ మూవీని జూలై 17న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.  ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెన్సేషనల్ డైరెక్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

*అనిల్ రావిపూడి మాట్లాడుతూ* .. ‘తెలుగు ఇండస్ట్రీలోకి నిర్మాతగా వస్తున్న కిషోర్ గారికి థాంక్స్. ‘వదలా’ చిత్రంతో నిర్మాత కిషోర్ గారికి మంచి విజయం దక్కాలి. తమ్మారెడ్డి గారు, జగపతి బాబు గారి మీదున్న ప్రేమ, గౌరవంతో ఇక్కడకు వచ్చాను. ‘వదలా’ ట్రైలర్ నాకు చాలా నచ్చింది. కాన్సెప్ట్, కథ చాలా కొత్తగా అనిపించింది. పాటలు నాకు చాలా నచ్చాయి. ట్రైలర్‌ను చూస్తే అందరూ సహజంగా నటించారని అర్థం అవుతోంది. చోటా గారు అందరికీ సన్నిహితులు. ఆయన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. తమ్మారెడ్డి గారు ఏదైనా సరే కుండ బద్దలు కొట్టినట్టు కాదు.. ముక్కలు చేసినట్టుగా మాట్లాడతారు. జగపతి బాబు అంటే ఫ్యామిలీ హీరో. జగపతి బాబు గారు అన్ని రకాల పాత్రల్ని, సినిమాల్ని చేశారు. ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మాలాంటి అప్ కమింగ్ దర్శకులందరికీ వరం. ఆయనకు ఈ మూవీతో మంచి విజయం దక్కాలి. జూలై 17న అందరూ ‘వదలా’ మూవీని చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.