అంత:పురం తర్వాత  వదలానే   బెస్ట్ ఫిల్మ్ – తమ్మారెడ్డి భరద్వాజ్

Vadala Is the Best Film After Anthahpuram says Tammareddy Bharadwaja

చరిత చిత్ర బ్యానర్ మీద కిషోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ సంయుక్తంగా నర్మించిన చిత్రం ‘వదలా’. జగపతి బాబు, లయ, హృతిక శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో ఆకెళ్ల వి కృష్ణ ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ మూవీని జూలై 17న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెన్సేషనల్ డైరెక్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ* .. ‘సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి యాభై ఏళ్లు అవుతోంది. ఓ పదేళ్ల క్రితం వైరాగ్యంతో సినీ సన్యాసం తీసుకుంటే.. కిశోర్ గారు మాత్రం ‘వదలా’ అనే సినిమా నిర్మించాల్సిందే అని పట్టు పట్టారు. పన్నెండేళ్ల క్రితం మేకింగ్ ఆపేశాను. చోటాతో ఎలా పని చేస్తామో అనుకున్నా.. కానీ సెట్‌లో ఎంతో సరదాగా ఉండేవారు. అవుట్ పుట్ చూశాక అద్భుతం అనిపించింది.

నా ప్రొడక్షన్స్‌లో ‘అంత:పురం’ తర్వాత ఇదే బెస్ట్ ఫిల్మ్. గ్లింప్స్ రిలీజ్ అయిన తర్వాత అమెరికా నుంచి ఫోన్స్ వచ్చాయి. ‘లెనిన్’తో పాటుగా మా ట్రైలర్‌ను థియేటర్లో ప్రదర్శిస్తుంటే మంచి రెస్పాన్స్ వస్తోంది. మాకు మంచి సలహాలు ఇచ్చిన వెంకట్ గారికి థాంక్స్. మా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లందరికీ థాంక్స్. కార్తిక్‌ని, లిరిసిస్ట్‌లను బాగానే హింసించాను (నవ్వుతూ). పిలిచిన వెంటనే చెప్పిన టైంకి వచ్చిన అనిల్ రావిపూడి గారికి థాంక్స్. జూలై్ 17న వదలకుండా మా ‘వదలా’ సినిమాని చూడండి’ అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.