నటీనటులు: అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే, నరేష్, రఘుబాబు తదితరులు
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకత్వం: మురళీ కిషోర్ అబ్బూరు
ఎడిటింగ్ : నవీన్ నూలి
సంగీతం: ఎస్.ఎస్. థమన్
నిర్మాణ సంస్థ: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, మనం ఎంటర్‌ప్రైజెస్
అక్కినేని అఖిల్ లీడ్ రోల్‌లో మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన రూరల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘లెనిన్’.లాంగ్ గ్యాప్ తరువాత అఖిల్ నుండి వచ్చిన సినిమా కావడం అలాగే సాంగ్స్ , ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతోపాటు ప్రమోషన్స్ కూడా భారీగా చేయడం తో సినిమాకు భారీ హైప్ వచ్చింది. మరి భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఎలా వుంది ? అఖిల్ కు కావాల్సిన విజయాన్ని అందించిందో లేదో రివ్యూలో తెలుసుకుందాం.
కథ :
చిత్తూరు జిల్లాలోని భారతంమిట్ట గ్రామంలో ద్రౌపదిని కొలిచే వందో భారతం మిట్ట జాతర నిర్వహించే విషయంలో జయమ్మ (ఈశ్వరీ రావు) కుటుంబానిదే ఎప్పుడూ పైచేయిగా ఉంటుంది. అయితే ఆ జాతరపై ఎలాగైనా ఆధిపత్యం సాధించాలని స్థానిక ఎమ్మెల్యే (రమేశ్ ఇందిరా) వర్గం ఎన్నో కుట్రలు పన్నుతుంటుంది. ఇటువంటి గొడవల నేపథ్యంలో అనాథ అయిన లెనిన్ (అఖిల్) ను జయమ్మ కుటుంబం చేరదీసి తమలో ఒకడిగా చూసుకుంటుంది. జయమ్మ కొడుకు వసంత్ (ప్రమోద్ పంజు) కు లెనిన్ ప్రాణస్నేహితుడిగా మారతాడు. అదే గ్రామానికి చెందిన భారతీ (భాగ్యశ్రీ బోర్సే), లెనిన్ ప్రేమించుకున్నప్పటికీ.. వసంత్‌తో భారతీ పెళ్లి నిశ్చయం కావడంతో స్నేహితుడి కోసం లెనిన్ తన ప్రేమను త్యాగం చేయాలనుకుంటాడు. ఆ తర్వాత ఆ గ్రామంలో జరిగిన రాజకీయాలు ఏంటి, యతిరాజులు (శివాజీ) చేసిన నమ్మక ద్రోహం వల్ల లెనిన్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, వీటన్నింటినీ ఎదిరించి జాతరను, తన వారిని లెనిన్ ఎలా కాపాడుకున్నాడు అనేదే ఈ సినిమా కథ.
విశ్లేషణ :
దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు ఒక సాధారణ గ్రామీణ కక్షల కథను కాకుండా, దానికి ‘మహాభారతం’ కథలోని పాత్రల స్వభావాలను, నీతిని జోడించి ఒక విభిన్నమైన సోషల్ డ్రామాగా దీనిని తెరకెక్కించారు. జాతర బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ కథాంశం ఒకవైపు కమర్షియల్ హంగులను అందిస్తూనే, మరోవైపు బలమైన మానవ సంబంధాలను మరియు భావోద్వేగాలను అద్భుతంగా ఆవిష్కరించింది.
సినిమా ప్రారంభంలో చిత్తూరు జిల్లా నేపథ్యంలో జరిగే జాతర ఎపిసోడ్స్, గ్రామీణ వాతావరణాన్ని ఎస్టాబ్లిష్ చేసిన విధానం చాలా ఎమోషనల్‌గా ఉంటూ కథపై ఆసక్తిని పెంచుతుంది. జైలు నుండి లెనిన్ విడుదలయ్యే సీన్‌తో ఫ్లాష్‌బ్యాక్‌పై క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. ప్రథమార్ధంలో అఖిల్, భాగ్యశ్రీల మధ్య వచ్చే లవ్ సీన్స్ క్లాసిక్‌గా సాగుతూ ఇంటర్వెల్ బ్యాంగ్‌కు మంచి బేస్ క్రియేట్ చేస్తాయి.
అయితే ద్వితీయార్థం ఈ సినిమాకు అసలైన బలంగా నిలిచింది. దర్శకుడు రాసుకున్న సోషల్ మహాభారతం థీమ్ స్క్రీన్‌ప్లేను చాలా ఆసక్తికరంగా మార్చింది. సెకండాఫ్‌లో వచ్చే విభిన్నమైన మలుపులు, ఊహించని ట్విస్ట్‌లు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. క్లైమాక్స్ వైపు వెళ్లే కొద్దీ వచ్చే ఎమోషనల్ అండ్ యాక్షన్ బ్లాక్స్ థియేటర్లలో సాలిడ్ హై ఇస్తాయి.
నటీనటుల పనితీరు :
ఇప్పటివరకు క్లాస్ అండ్ అర్బన్ లుక్స్‌లోనే కనిపించిన అఖిల్ అక్కినేని, ఈ సినిమాలో ఊరమాస్ లెనిన్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ మరియు క్లైమాక్స్ ఎమోషనల్ సీన్స్‌లో ఆయన నటన అద్భుతంగా ఉంది.
హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా కథకు కీలకమైన ‘భారతి’ పాత్రలో ఎంతో ప్యాషన్ తో నటించి మెప్పించింది.హీరో స్నేహితుడిగా ప్రమోద్ పంజు నెగెటివ్ అండ్ పాజిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించగా, శివాజీ, ఈశ్వరి రావు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
సాంకేతికంగా కూడా సూపర్ అనిపించుకుంది లెనిన్. మురళీ కిషోర్ అబ్బూరు రాసుకున్న స్క్రీన్‌ప్లే, పాత్రల డిజైనింగ్ చాలా లోతుగా ఉన్నాయి. ముఖ్యంగా ఎస్.ఎస్. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాలోని యాక్షన్ మరియు జాతర ఎపిసోడ్స్‌ను నెక్ట్స్ లెవెల్‌కు ఎలివేట్ చేసింది. లియోన్ ప్రిట్టో సినిమాటోగ్రఫీ రూరల్ విజువల్స్‌ను చాలా క్వాలిటీగా స్క్రీన్ పై ఆవిష్కరించింది.ఎడిటింగ్ ఓకే.నిర్మాణ విలువలు ఉన్నంతగా వున్నాయి. రెండు అగ్ర నిర్మాణ సంస్థలు సినిమాను చాలా క్వాలిటీతో నిర్మించాయి.
చివరగా ‘లెనిన్’ చిత్రం రాయలసీమ జాతర నేపథ్యంలో సాగే ఒక పక్కా ఎమోషనల్, కమర్షియల్ విలేజ్ యాక్షన్ డ్రామా. అఖిల్ అక్కినేని వన్ మ్యాన్ షో, థమన్ బిజీఎమ్ మరియు ఊహకందని ట్విస్ట్‌లతో సాగే సెకండ్ హాఫ్ కోసం ఈ సినిమాను థియేటర్లలో ఖచ్చితంగా చూడవచ్చు.అంతేకాదు ఈసినిమాతో ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సాలిడ్ హిట్ ను కూడా అఖిల్ అందుకోనున్నాడని చెప్పొచ్చు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























