బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన తెచ్చుకుంటున్న ‘నాగబంధం’ సినిమా మొదటి వారం వసూళ్ల వివరాలను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. విజువల్స్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ వీక్ ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా 35 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. కథలోని ఎలిమెంట్స్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులకు నచ్చడంతో వారం రోజుల్లోనే ఈ స్థాయి కలెక్షన్లను రాబట్టడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మొదటి వారం అంతా స్థిరమైన వసూళ్లతో బాక్సాఫీస్ రన్‌ను కొనసాగించిన ఈ చిత్రం, అదే జోష్‌తో ఇప్పుడు విజయవంతంగా రెండో వారంలోకి అడుగుపెట్టింది. వీక్‌డేస్‌లో కూడా పర్వాలేదనిపించేలా కలెక్షన్లు రావడం సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారింది. రాబోయే శని, ఆదివారాల్లో కూడా ఈ వసూళ్లు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
మొత్తానికి 35 కోట్ల గ్రాస్ వసూళ్లతో మొదటి వారాన్ని పూర్తి చేసుకున్న ‘నాగబంధం’, రానున్న రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి నంబర్స్ నమోదు చేస్తుందో చూడాలి. విరాట్ కర్ణ హీరోగా నటించిన ఈసినిమాకు అభిషేక్ నామ దర్శకత్వం వహించారు.భారీ బడ్జెట్ తో కిషోర్ అన్నపురెడ్డి,నిశిత నాగిరెడ్డి నిర్మించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























