అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి సెన్సేషనల్ చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసిన స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో వస్తున్న సరికొత్త చిత్రం ‘రోమాంచకం’. ‘మేమ్ ఫేమస్’ ఫేమ్ సుమంత్ ప్రభాస్, ‘మ్యాడ్’ బ్యూటీ అనంతిక సనిల్కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్ను మేకర్స్ విడుదల చేశారు. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ‘ప్రేమ.. హాస్యం.. ఉత్కంఠ’ అనే ట్యాగ్లైన్ పెట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా విడుదలైన గ్లింప్స్ విషయానికి వస్తే.. “జానకి చెంతనే రాముని హృదయం.. ఈ ప్రేమ కావ్యం మృదుమధురం.. అణువు అణువును ఉర్రూతలూపే ప్రణయ కల్లోలమే రోమాంచకం” అంటూ బ్యాక్గ్రౌండ్లో వచ్చే మెలోడియస్ సాంగ్తో చాలా ప్లెజెంట్గా, రొమాంటిక్గా మొదలవుతుంది. హీరో హీరోయిన్ల మధ్య బైక్ రైడ్స్, సముద్ర తీరంలో పరుగులు వంటి బ్యూటిఫుల్ విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే, అంతా బాగుంది అనుకునే లోపు.. ఒకరినొకరు కొట్టుకుంటూ, ‘ఐ హేట్ యూ’ అని చెప్పుకోవడంతో గ్లింప్స్ ముగుస్తుంది. ఈ ఒక్క ట్విస్ట్తో ఇందులో వంగా మార్క్ స్ట్రాంగ్ ఎమోషన్ ఉందని స్పష్టమవుతోంది.
వాసుకి వైభవ్ అందించిన మ్యూజిక్, పవన్ పప్పుల విజువల్స్ ఈ గ్లింప్స్కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఒక చిన్న వీడియోతోనే సినిమాపై అంచనాలను క్రియేట్ చేసిన మేకర్స్, ఈ ‘రోమాంచకం’ చిత్రాన్ని సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























