అక్కినేని అఖిల్ నటిస్తున్న ‘లెనిన్’ సినిమా కోసం గ్లోబల్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగారు. ఈ చిత్రానికి ఎన్టీఆర్ తన పవర్‌ఫుల్ బేస్ వాయిస్‌తో వాయిస్ ఓవర్ అందించారు. సినిమా ప్రారంభంలో కథను, లెనిన్ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ తారక్ ఇచ్చిన వాయిస్ ఓవర్ చిత్రానికే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇప్పటికే ఆయన తన పార్ట్ డబ్బింగ్ పూర్తి చేసినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిత్తూరు, రాయలసీమ రాజకీయాల నేపథ్యంలో రాబోతున్న ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాకు ఎన్టీఆర్ సపోర్ట్ తోడవడంతో అక్కినేని, నందమూరి అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. ఈ క్రేజీ అప్‌డేట్‌తో జూలై 10న విడుదల కాబోతున్న ‘లెనిన్’ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా స్కై హైకి చేరాయి.
మురళి కిషోర్ అబ్బూరు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమాలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా తమన్ సంగీతం అందించారు.అక్కినేని నాగార్జున , నాగవంశీ ఈసినిమాను నిర్మించారు. ఈసినిమాపై అక్కినేని ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























