నిర్మాతగా కొత్త సినిమా ప్రకటించిన ప్రదీప్ .. ఏకంగా ఆరుగురు డైరెక్టర్లు

Pradeep Ranganathan Announces a New Film as Producer

‘లవ్ టుడే’ సినిమాతో సౌత్ ఇండియా వ్యాప్తంగా సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకొని, యూత్‌లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు సరికొత్త అవతారమెత్తారు. ఆయన సొంతంగా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతూ ‘పీఆర్ షో’ అనే కొత్త ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించారు. ఈ బ్యానర్ నుండి రాబోతున్న మొదటి ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ వీడియోను తాజాగా యూట్యూబ్‌లో విడుదల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రానికి ప్రదీప్ రంగనాథన్ కథను అందించడంతో పాటు స్వయంగా నిర్మిస్తుండటం విశేషం. ‘ది ఆల్ఫా యూనిట్’ ఈ సినిమాకు కథనం సమకూరుస్తూ దర్శకత్వం వహిస్తోంది. ఇందులో మొత్తం 6గురు డైరెక్టర్లు ఉండనున్నారు. క్రేజీ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ‘ప్రేమలు’ బ్యూటీ మమితా బైజు కథానాయికగా నటిస్తోంది.

ఈ ప్రాజెక్ట్ లో డైరెక్టర్ అశ్వత్ తోపాటు ప్రముఖ తెలుగు నటుడు నుండి శివాజీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.సరికొత్త కాన్సెప్ట్ మరియు భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.