తమిళ యంగ్ హీరో అథర్వ మురళి ప్రధాన పాత్రలో, మలయాళ స్టార్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా ‘ఇదయం మురళి’. కాగా, ఈ క్రేజీ తమిళ చిత్రాన్ని తెలుగులో ‘హృదయం మురళి’పేరుతో విడుదల చేయబోతున్నారు. టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రాన్ని ఈనెల 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మైత్రీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద బ్యానర్ ఈ సినిమాను తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తుండటంతో, ఇరు రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్ట్‌పై సాలిడ్ అంచనాలు మరియు మంచి బిజినెస్ క్రేజ్ ఏర్పడ్డాయి.
నిర్మాత ఆకాశ్ భాస్కరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించి డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అథర్వ మురళి సరసన ప్రీతి ముకుందన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించగా .. నటరాజన్ సుబ్రహ్మణ్యం, నిహారికా ఎన్.ఎమ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సౌత్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ ఈ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. మైత్రీ సంస్థకు ఉన్న బలమైన పంపిణీ వ్యవస్థ కారణంగా తెలుగులో ఈ సినిమాకు భారీ స్థాయిలో థియేటర్లు లభించనున్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























