నాగబంధం చాలా కాస్ట్లీ సినిమా, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి – నిర్మాత సురేష్ బాబు

Nagabandham Promises a Grand Visual Experience Says D. Suresh Babu

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ విజువల్ వండర్ ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జూలై 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. నిర్మాత సురేష్ బాబు ఈ వేడుకకు ముఖ్య అతిథి గా హాజరయ్యారు.

ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ లో నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు పెద్ద సెట్ వేసినప్పుడు అభిషేక్ నాకు ఫోన్ చేసి వచ్చి చూడమని చెప్పేవారు. తను అద్భుతంగా ఈ సినిమాను తీశాడు. అలాగే ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కూడా చాలా చక్కని వర్క్ ఇచ్చారు. అశోక్ నాకు ‘ఇంద్రుడు చంద్రుడు’, ‘కలిసుందాం రా’ సినిమాలప్పటి నుంచి పరిచయం. తను ఈ సినిమాకి అద్భుతమైన వర్క్ ఇచ్చాడు. ఇది చాలా కాస్ట్లీగా తీసిన సినిమా. నేను రషెస్ చూశాను. అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు చేశారు. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.