విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ విజువల్ వండర్ ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జూలై 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. నిర్మాత సురేష్ బాబు ఈ వేడుకకు ముఖ్య అతిథి గా హాజరయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ లో హీరో విరాట్ కర్ణ మాట్లాడుతూ…అందరికీ నమస్కారం. నటుడిగా మీ అందరి గుండెల్లో స్థానం సంపాదించుకోవడానికి ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశాను. సినిమా చూస్తే నేను ఎంత హార్డ్‌వర్క్ చేశానో మీకు అర్థమవుతుంది. మీ గుండెల్లో చోటు సంపాదించుకోవడానికి ఏం చేయాలో 100 శాతం ఈ సినిమాకు చేశాను. నాకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చిన అభిషేక్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఆయన అద్భుతంగా ఈ సినిమాను తీశారు. ఆయన ఈ కథ చెప్పినప్పుడు, కంటెంట్ చూపించినప్పుడు నేను షాక్ అయ్యాను. ఈ సినిమాలో ప్రతిదీ ఒక అద్భుతంలా కనిపిస్తుంది. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఇందులో మీరు చూస్తారు. మా నిర్మాతలు కిషోర్ గారు, నిశిత గారు సినిమాను అద్భుతంగా నిర్మించారు. అనంత పద్మనాభస్వామి రథయాత్ర ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో మీరందరూ చూస్తున్నారు.
అందరూ కూడా మా ప్రాంతానికి తీసుకురావాలని అడుగుతున్నారు. ఇంత పెద్ద స్థాయిలో పబ్లిసిటీ జరగడానికి ప్రధాన కారణం మా నిర్మాతలు, ముఖ్యంగా నిశిత గారు. ఆమె లేకపోతే ఈ సినిమాకు ఇంత పబ్లిసిటీ వచ్చేదని నేను అనుకోను. ఇలాంటి నిర్మాతలకు ప్రేక్షకులు సపోర్ట్ చేస్తే మరిన్ని అద్భుతమైన సినిమాలు వస్తాయి. మా డీవోపీ ప్రతి డీటెయిల్‌ను అద్భుతంగా చిత్రీకరించారు. ఆయనకు హ్యాట్సాఫ్. ప్రణవ్ సినిమాను అద్భుతంగా కట్ చేశాడు. తనకు ఎప్పుడూ సినిమా గురించే ఆలోచన. ఎంతో ఎనర్జీతో పనిచేశాడు.మరోసారి మా నిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా దర్శకుడు అభిషేక్ గారు నన్ను ఒక ఆణిముత్యంలా తీర్చిదిద్దారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది కేవలం ఒక సినిమా కాదు… ఒక ఎక్స్ పీరియన్స్. మన భారతీయ సంస్కృతిని, వారసత్వాన్ని సెలబ్రేట్ చేసుకునే సినిమా. జూలై 3న అందరం థియేటర్లలో కలుద్దాం. అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా టీజర్, ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. మా నిర్మాతలు పెట్టిన ప్రతి రూపాయి వారికి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























