లేడీ గ్యాంగ్‌తో యష్.. ఒక్కొక్కరిగా వస్తారా ,ఒకే సారి వస్తారా

Ladies & Ladies out from Toxic

కేజీఎఫ్ సిరీస్‌తో పాన్-ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రాకింగ్ స్టార్ యష్ తన నెక్స్ట్ మూవీ టాక్సిక్ తో మరోసారి భీభత్సం సృష్టించడానికి సిద్ధమయ్యారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుండి తాజాగా ‘లేడీస్ అండ్ లేడీస్’ పేరుతో పవర్ ఫుల్ వీడియో ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విడుదలైన గ్లింప్స్ వీడియోలో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఎపిసోడ్స్, గన్‌ ఫైట్స్ మరియు అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలిచాయి.స్టార్ లేడీ గ్యాంగ్.. నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, హ్యుమా ఖురేషి మరియు రుక్మిణి వసంత్ లను గ్లింప్స్ ద్వారా పరిచయం చేశారు.. వీడియో చివర్లో యష్ రగ్గడ్ లుక్‌లో లేడీస్ & లేడీస్ ఒక్కొక్కరిగా వస్తారా ఒకేసారి వస్తారా అంటూ చెప్పే డైలాగ్ అలాగే చేతిలో గన్ పట్టుకుని ఒక లేడీ ఫైటర్‌తో సీన్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది.

ఈ గ్లింప్స్ వీడియో ద్వారా కేవలం క్యారెక్టర్లను పరిచయం చేయడమే కాకుండా రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ మరోసారి ప్రకటించారు. ఈ క్రేజీ పాన్-ఇండియా యాక్షన్ డ్రామాను ఆగస్టు 26, 2026 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ‘కేజీఎఫ్’ తర్వాత యష్ నటిస్తున్న సినిమా కావడంతో బాక్సాఫీస్ వద్ద మరోసారి రికార్డుల వేట మొదలవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.