మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ కథానాయికగా దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కించిన గ్రామీణ నేపథ్య ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల నుంచి మరియు మెగా అభిమానుల నుంచి ఈ చిత్రానికి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో, సినిమాను మరింత మంది సామాన్య ప్రేక్షకులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ మరియు చిత్రబృందం ఒక ఊహించని సాలిడ్ నిర్ణయం తీసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతున్న ఈ సినిమా టికెట్ ధరలను భారీగా తగ్గించారు.ఈరోజు నుండి నైజాం ఏరియాలోని అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అత్యంత సరసమైన ధరలకే ‘పెద్ది’ సినిమాను వీక్షించే అవకాశాన్ని కల్పించారు.సింగిల్ స్క్రీన్స్‌లో క్లాస్ మరియు కేటగిరీలను బట్టి టికెట్ ధరలను రూ. 105, రూ. 80, మరియు రూ. 50 గా ఫిక్స్ చేశారు.
వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, జియో స్టూడియోస్ మరియు మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. నైజాం అంతటా మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా రిలీజ్ అయిన ఈ సినిమాకు టికెట్ ధరలు ఈ రేంజ్‌లో తగ్గడం నిజంగా సామాన్య ప్రేక్షకులకు పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి.సినిమా ఇప్పుడప్పుడే ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ లేకపోవడంతో ఇంకా ఈ సినిమాను థియేటర్లలో చూడని వారు ఉంటే, ఈ అదిరిపోయే ఆఫర్‌ను అస్సలు మిస్ చేసుకోవద్దు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























