విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఆదర్శ కుటుంబం’. విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో 77వ చిత్రంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా అనౌన్స్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రతి కుటుంబం గుర్తుపెట్టుకోవాల్సిన తేదీ అంటూ.. ‘ఆదర్శ కుటుంబం’ తలుపులు ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 2న (గాంధీ జయంతి సందర్భంగా) తెరుచుకోనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.
ఎస్. రాధాకృష్ణ (చిన్నబాబు), సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, రవిచంద్రన్ మరియాన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. చాలా కాలం తర్వాత వెంకటేష్ మార్క్ ఫ్యామిలీ డ్రామాను త్రివిక్రమ్ స్టైల్ డైలాగ్స్‌తో చూడబోతున్నామని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























