రెబల్‌స్టార్ ప్రభాస్ అభిమానులకు మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఇండియన్ సినిమా హిస్టరీని తిరగరాసిన ‘బాహుబలి’ సిరీస్‌కు సంబంధించి ప్రభాస్ ఒక సంచలన విషయాన్ని లీక్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తోన్న ‘బాహుబలి 3’ గురించి ప్రభాస్ అఫీషియల్ క్లారిటీ ఇచ్చేశారు. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, రెబల్‌స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కంక్లూజన్’ చిత్రాలు భారతీయ సినీ రికార్డులను ఎలా షేక్ చేశాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కట్ చేస్తే.. ఇప్పుడు ఈ ఐకానిక్ ఫ్రాంచైజీ నుండి మూడో భాగం ‘బాహుబలి 3’ రాబోతోందంటూ స్వయంగా ప్రభాస్ క్లారిటీ ఇవ్వడం ఇంటర్నెట్ను ఊపేస్తోంది.
భారతీయ సినిమా చరిత్రలో సంచలన విజయాలు నమోదు చేసిన ‘బాహుబలి’ సిరీస్ ప్రపంచాన్ని విస్తరిస్తూ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’ పేరుతో ఒక ప్రత్యేక డాక్యుమెంటరీ సిరీస్‌ను తీసుకొచ్చింది. మొత్తం నాలుగు ఎపిసోడ్లుగా రూపొందిన ఈ డాక్యుమెంటరీలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి కలిసి పంచుకున్న అనుభవాలు, చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ డాక్యుమెంటరీలో ప్రభాస్ చేసిన ‘బాహుబలి లెగసీ ఇంకా ముగియలేదు’ అనే కామెంట్ అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపింది. అంతేకాకుండా ప్రభాస్, రానా, అనుష్క ముగ్గురూ కలిసి మాట్లాడిన సందర్భంలో ‘బాహుబలి ప్రపంచం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది’ అని పేర్కొంటూ ‘బాహుబలి పార్ట్ 3’ గురించి ప్రస్తావించడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ‘బాహుబలి 3’పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి.
అయితే ఇప్పటి వరకు దర్శకుడు రాజమౌళి గానీ, నిర్మాతలు గానీ అధికారికంగా ‘బాహుబలి 3’ ప్రాజెక్టును ప్రకటించలేదు. అయినప్పటికీ ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో కొత్త ఆశలను రేకెత్తించాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























