పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్‌లో వచ్చిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా తర్వాత, ఇప్పుడు ‘ఓజీ యూనివర్స్’ ను మరింత విస్తరిస్తూ మేకర్స్ ఒక అఫీషియల్ అప్‌డేట్‌ను రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ తన సొంత నిర్మాణ సంస్థ ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ బ్యానర్‌లో సుజీత్ దర్శకత్వంలో ఓజీ 2 చేయనున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ విషయాన్ని మేకర్స్ వీడియో ద్వారా అఫీషియల్ గా ప్రకటించారు. తుఫాను వచ్చే ముందు కాసేపు నిశ్శబ్దం ఉంటుంది.. గంభీర యొక్క అన్‌టోల్డ్ స్టోరీ ఆవిష్కృతం కావడానికి సిద్ధంగా ఉంది అంటూ మేకర్స్ ఒక పవర్‌ఫుల్ అనౌన్స్మెంట్ వీడియోను వదిలారు. ‘ఓజీ’ సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ పేరు ‘గంభీర’ అని మనకు తెలిసిందే. ఇప్పుడు ఆ క్యారెక్టర్ లేదా ఆ బ్యాక్‌డ్రాప్‌కు సంబంధించిన ఒక అన్‌టోల్డ్ స్టోరీని ‘ఓజీ యూనివర్స్’ లో భాగంగా సుజీత్ మన ముందుకు తీసుకురాబోతున్నారు. దాంతో ఈసినిమాపై పవన్ అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.తమన్ ఈసినిమాకు సంగీతం అందించనున్నాడు. త్వరలోనే ఈసినిమా గ్రాండ్ గా లాంచ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























