కామ్రేడ్ కళ్యాణ్ నుండి ఒరియా పిల్ల సాంగ్ రిలీజ్

Oriya Pilla from Comrade Kalyan Out Now

భిన్నమైన కథలు, ఎంటర్‌టైనింగ్ పెర్ఫార్మెన్స్ తో అలరిస్తున్న ‘కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’ శ్రీ విష్ణు, సరికొత్త నేపథ్యంతో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కామ్రేడ్ కళ్యాణ్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో, కోన వెంకట్ సమర్పణలో, స్కంద వాహన మోషన్ పిక్చర్స్ LLP బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీత కర్నాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌కు ఇప్పటికే అద్భుతమైన స్పందన లభించింది. 1992 నాటి ఆంధ్ర-ఒడిశా సరిహద్దు నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఇందులో మహిమ నంబియార్ కథానాయికగా నటిస్తోంది. చిత్ర బృందం ఈ రోజు ఈ సినిమాలోని మొదటి పాట ‘ఒరియా పిల్ల’ను లాంచ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ పాట ‘కామ్రేడ్ కళ్యాణ్’లోని రొమాంటిక్ వరల్డ్ ని పరిచయం చేస్తూ, ఒక సున్నితమైన ప్రేమకథను ప్రజెంట్ చేసింది. సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ స్వరపరిచిన ఈ మెలోడీ, ఆకట్టుకునే ట్యూన్‌తో పాటు హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలను పలికించింది. వింటేజ్ మాధుర్యాన్ని గుర్తు చేసే ఈ గీతానికి సిద్ శ్రీరామ్ తన మంత్రముగ్ధం చేసే వాయిస్ తో ప్రాణం పోశారు. ప్రేమలో మొదటిసారి కలిగే ఆనందం, అమాయకత్వం ఆయన తన స్వరంతో అద్భుతంగా పలికించారు.

భాస్కరభట్ల అందించిన సాహిత్యం ఓ ఒరియా యువతిపై ప్రేమలో పడిన యువకుడి భావాలను ఎంతో అందంగా ఆవిష్కరించింది. సహజంగా ప్రవహించే పదాలు పాటలోని మృదుత్వాన్ని మరింత పెంచి వెంటనే లిజినర్స్ కు కనెక్ట్ అయ్యేలా చేస్తున్నాయి.

విజువల్‌గా కూడా ఈ పాట ఆకట్టుకుంటోంది. ప్రేమలో మునిగిపోయిన యువకుడిగా శ్రీవిష్ణు తన సహజమైన నటనతో మెప్పించగా, మహిమా నంబియార్ తన అందంతో, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది.

మధురమైన స్వరాలు, హృదయాన్ని తాకే సాహిత్యం, సిద్ శ్రీరామ్ గానం, అందమైన విజువల్స్ కలిసి ‘ఒరియా పిల్ల’ను ఒక చార్ట్‌బస్టర్‌గా నిలిపాయి. ఈ పాటతో ‘కామ్రేడ్ కళ్యాణ్’పై అంచనాలు మరింత పెరిగాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.