నాగబంధం ఒక విజువల్ స్పెక్టాకిల్ – నభా నటేష్

Nabha Natesh Calls Nagabandham a Visual Extravaganza

‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’ చిత్రం తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌తో అంచనాలను మరింత పెంచేసింది. దర్శకుడు అభిషేక్ నామా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్‌లో విరాట్ కర్ణ హీరోగా నటించారు. పురాణాలు, రహస్యాలు, దివ్యశక్తులు, అడ్వెంచర్ అంశాల సమ్మేళనంగా రూపొందిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఓ అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకెళ్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ నభా నటేష్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ‘నాగబంధం’ మన సనాతన ధర్మం, చారిత్రక అంశాలను అద్భుతంగా ఆవిష్కరించిన విజువల్ స్పెక్టాకిల్. ప్రేక్షకులకు ఇది తప్పకుండా గొప్ప థియేట్రికల్ అనుభూతిని అందిస్తుంది. ఇలాంటి ఎపిక్ కథలో భాగం కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు అభిషేక్ నామా గారికి, నిర్మాతలకు ధన్యవాదాలు. అభిషేక్ గారి వంటి కంటెంట్‌పై నమ్మకం ఉన్న క్రియేటర్స్ మాత్రమే ఇలాంటి అద్భుతమైన చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలరు. నేను కూడా ఈ సినిమాను ఒక ప్రేక్షకురాలిగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.