స్టార్ యాక్ట్రెస్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఎమోషనల్ అండ్ కమర్షియల్ డ్రామా ‘మా ఇంటి బంగారం’ మరి కొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది. సమంత కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాపై మొదటి నుండి ప్రేక్షకులలో, ట్రేడ్ వర్గాలలో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రిలీజ్‌కు ముందే ప్రీ-సేల్స్ రూపంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా అందుతున్న ట్రేడ్ సమాచారం ప్రకారం, ఈ సినిమా వరల్డ్‌వైడ్ అడ్వాన్స్ బుకింగ్స్ అండ్ ప్రీ-సేల్స్ లోనే ఏకంగా రూ. 6 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఈ రేంజ్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం సమంతకు ఉన్న క్రేజ్ మరియు బాక్సాఫీస్ స్టామినాను మరోసారి నిరూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి గ్రాండ్‌గా అడుగుపెడుతున్న ఈ సినిమాకు, ఓపెనింగ్ డే రోజున బాక్సాఫీస్ వద్ద పక్కాగా సాలిడ్ ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తుంది . సమంత పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, కథలోని బలమైన ఎమోషన్స్ ఈ చిత్రానికి మెయిన్ ప్లస్ పాయింట్స్ కానున్నాయని ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే స్పష్టమవుతోంది.
సమంత మార్క్ ఇంటెన్స్ డ్రామాతో రాబోతున్న ‘మా ఇంటి బంగారం’ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మౌత్ టాక్ కనుక పాజిటివ్‌గా వస్తే, ఈ సినిమా లాంగ్ రన్‌లో మరిన్ని భారీ కలెక్షన్లతో సమంత కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలువనుంది.మరి బాక్సాఫీస్ వద్ద సరికొత్త వేటను ప్రారంభించిన ‘మా ఇంటి బంగారం’ మొదటి రోజు ఎలాంటి సంచలన వసూళ్లను నమోదు చేస్తుందో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























