రామ్ చరణ్ – బుచ్చి బాబు సానా కాంబినేషన్ లో వచ్చిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద రాంపేజ్ కొనసాగిస్తోంది =. థియేటర్లలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఊరమాస్ ర్యాంపేజ్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం, ప్రస్తుతం కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద సరికొత్త మైలురాళ్లను అందుకుంటోంది. కేవలం 9 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 366 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి.. 2026 సంవత్సరానికి గాను దక్షిణాది చిత్రాల్లో నెం.1 గ్రాసర్ గా నిలిచి రికార్డు క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ రేంజ్ వసూళ్లతో 2026లో దక్షిణాదిలోనే అత్యధిక వసూళ్లు సాధించిన అతిపెద్ద చిత్రంగా ‘పెద్ది’ అవతరించింది. కేవలం కలెక్షన్ల పరంగానే కాకుండా టిక్కెట్ల అమ్మకాల్లోనూ ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫామ్స్ అయిన బుక్ మై షో మరియు డిస్ట్రిక్ట్ లలో కలిపి ఇప్పటివరకు ఏకంగా 6 మిలియన్లకు పైగా టిక్కెట్లు అమ్ముడవడం ఈ సినిమాకు ఉన్న క్రేజీ పాపులారిటీని స్పష్టం చేస్తోంది.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం సెకండ్ వీకెండ్ లో కూడా సూపర్ వసూళ్లను రాబట్టుకుంటుంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ సినిమా లాంగ్ రన్‌లో 400కోట్ల క్లబ్ లో చేరనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























