వీరసింహారెడ్డి వంటి మాసివ్ హిట్ తర్వాత గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్ వస్తున్న విషయం తెలిసిందే. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బాలయ్య 111వ చిత్రం (#NBK111) అఫీషియల్ గ్లింప్స్ సరిగ్గా బాలయ్య పుట్టినరోజు కానుకగా విడుదలై సోషల్ మీడియాలో పూనకాలు తెప్పిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గోపీచంద్ మలినేని సినిమాల్లో హీరోల ఎలివేషన్లు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ గ్లింప్స్‌లో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని అత్యంత పవర్‌ఫుల్ మాస్ కటౌట్‌గా ఆవిష్కరించారు. ఆయన రాయల్ లుక్, నడిచి వస్తున్న స్టైల్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయం.
అయితే డైలాగ్స్ ఏమి లేకుండా కేవలం యాక్షన్ సీక్వెన్స్ తో ఈ గ్లింప్స్ రావడం విశేషం. ఈ గ్లింప్స్ లోని యాక్షన్ ఈ సినిమా బాక్సాఫీస్ వేట గట్టిగా ఉండబోతోందని నిరూపిస్తున్నాయి.
విజువల్స్ ఎంతో గ్రాండ్‌గా, రిచ్‌గా ఉన్నాయి.తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి షాట్‌ను నెక్స్ట్ లెవెల్‌కు ఎలివేట్ చేసింది.వృద్ధి సినిమాస్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ నిర్మాణ విలువలతో, ఎక్కడా రాజీ పడకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో నిర్మిస్తోంది. బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబోపై ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పుఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు, హీరోయిన్ మరియు ఇతర నటీనటుల వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























