సింగ్ గీతం… ఒక రోజు ఆలస్యంగా

Sing Geetham Release Postponed by One Day

చాలా మంది ఫిల్మ్ మేకర్స్ సినిమా విడుదల అనేది ఒక ముగింపు ఘట్టం. అయితే లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, క్రియేటివ్ ఫిల్మ్‌మేకర్ నాగ్ అశ్విన్ లకు మాత్రం తాము ఊహించిన ప్రతి క్రియేటివ్  ఎలిమెంట్ తెరపై అత్యుత్తమంగా ఆవిష్కృతమయ్యేలా చూసుకోవడమే ముఖ్యం. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘సింగ్ గీతం’ చిత్రం తొలుత జూన్ 11న విడుదల కావాల్సి ఉండగా, ఇప్పుడు జూన్ 12కి వాయిదా పడింది. కథలో కీలక పాత్ర పోషించే కొన్ని ముఖ్యమైన సీజీఐ, విజువల్ ఎఫెక్ట్స్ పనులను మరింత మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘సింగ్ గీతం’ ఒక ఫాంటసీ, సూపర్‌నేచురల్ ప్రపంచాన్ని ఆవిష్కరించే చిత్రం. ఇందులో సంగీతంతో పాటు విజువల్స్ కూడా కథనంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. ప్రేక్షకులను ఆ ప్రపంచంలో పూర్తిగా లీనం చేసే అనుభూతిని కలిగించాలనే ఉద్దేశంతో, చిత్ర బృందం ఫైనల్ అవుట్‌పుట్‌ను మరింత పర్ఫెక్ట్ చేయడానికి అదనపు సమయం కేటాయిస్తోంది. థియేటర్లలోకి తొందరపడి తీసుకురావడం కంటే అత్యుత్తమ నాణ్యతతో అందించాలనే ఆలోచనతోనే ఈ ఒకరోజు వాయిదా నిర్ణయం తీసుకున్నారు.

వైజయంతి మూవీస్, స్వప్న సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆయాన్, అహల్యా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, శాలిని కొండెపూడి కీలక పాత్ర పోషిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో పాటలు, నేపథ్య సంగీతం మెయిన్ హైలెట్స్ గా  నిలవనున్నాయి.

ఇప్పటివరకు విడుదలైన పాటలు, టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇచ్చి సినిమాపై అంచనాలు పెంచాయి. విభిన్నమైన కాన్సెప్ట్, సింగీతం శ్రీనివాసరావు మార్క్ సృజనాత్మకత, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కలిసి ‘సింగ్ గీతం’ ను ఈ ఏడాది అత్యంత ప్రత్యేకమైన చిత్రాలలో ఒకటిగా నిలబెడుతున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.