అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’.ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి. ఇక ఆ అంచనాలకు తగట్లు ఈసినిమాను నైజాంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదలచేయనున్నారు. అందుకు ఫ్యాన్సీ రేట్ కు ఈసినిమా హక్కులను దక్కించుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా సంచలనంగా నిలిపేందుకు చిత్రబృందం విస్తృత స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్నారు. జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా కోసం మేకర్స్ దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రమోషనల్ టూర్‌ను ప్రకటించారు.
సాధారణ ప్రమోషన్స్‌కు భిన్నంగా, సినిమా కథలోని ట్రెజర్ హంట్ కాన్సెప్ట్‌కు అనుగుణంగా ఈ ప్రచార యాత్రను రూపొందించారు. ప్రతి నగరంలో జరిగే కార్యక్రమం ద్వారా సినిమా ప్రపంచం, అందులోని రహస్యాలు, సాహస అంశాలను ప్రేక్షకులకు మరింత దగ్గర చేయనున్నారు.
ఈ టూర్లో తొలి కార్యక్రమం జూన్ 19న హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్. సినిమా స్థాయి, విజువల్స్, కథపై మరింత ఆసక్తిని పెంచేలా ఈ ఈవెంట్ ఉండనుంది.
అనంతరం జూన్ 20 నుంచి 23 వరకు ముంబై, చెన్నై, బెంగళూరు, కొచ్చి నగరాల్లో వరుసగా ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్స్ ద్వారా దేశవ్యాప్తంగా సినిమా రీచ్‌ను మరింత విస్తరించాలనే లక్ష్యంతో చిత్రబృందం ముందుకు సాగుతోంది.
ఈ ప్రమోషనల్ టూర్లో ప్రత్యేక ఆకర్షణగా జూన్ 26న వారణాసిలో ‘వీర నాగ’ పాట విడుదల కానుంది. వారణాసి నగరానికి ఉన్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యత సినిమా టైటిల్, కథలోని నేపథ్యానికి అద్భుతంగా వుంటుంది.
అలాగే జూన్ 28న హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. విడుదలకు ముందు రోజు జూలై 2న ప్రత్యేక ప్రీమియర్ షో ఏర్పాటు చేసి, చిత్రబృందం ఈ ప్రమోషనల్ జర్నీని ఘనంగా సెలబ్రేట్ చేయనుంది.ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























