ఎన్టీఆర్ చేతి కుకీస్ కావాలన్న అభిమాని.. బ్రహ్మానందం మీమ్‌తో అదిరిపోయే రిప్లై

Jr. NTR Fan’s Cookie Request Gets a Funny Brahmanandam Meme Response

నటనలోనే కాకుండా వంట చేయడంలోనూ స్టార్‌ కథానాయకుడు ఎన్టీఆర్‌ ఎంతటి దిట్టో అందరికీ తెలిసిందే. షూటింగ్‌ల నుంచి కాస్త సమయం దొరికితే చాలు ఆయన కిచెన్‌లోకి వెళ్లి రకరకాల వంటలు చేస్తుంటారు. ఎన్టీఆర్‌ చేతి బిర్యానీ, నాటుకోడి కూరకు సినిమా పరిశ్రమలోనే ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. అయితే, తాజాగా ఆయన మొదటిసారి స్వయంగా కుకీస్‌ను బేక్ చేశారు. దీనికి సంబంధించిన ఒక చిన్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పంచుకోగా, అది సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎన్టీఆర్ సాధారణంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అంత యాక్టివ్‌గా ఉండరు, ఎవరికీ పెద్దగా రిప్లైలు కూడా ఇవ్వరు. కానీ ఈసారి మాత్రం ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. సాయితేజ అనే అభిమాని ఎన్టీఆర్ కుకీస్ వీడియోను రీపోస్ట్ చేస్తూ, “మా ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు అన్నా, మాకు ఒక రెండు కుకీస్‌ పంపించు” అని ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా సరదాగా కోరాడు.

దీనికి ఎన్టీఆర్‌ అనూహ్యంగా స్పందించారు. ‘కింగ్’ సినిమాలోని బ్రహ్మానందం పాపులర్ సీన్‌కు సంబంధించిన ఆడియో వీడియోను జోడిస్తూ, “అడ్రస్‌ పెట్టు.. ఫాస్ట్‌గా అడ్రస్‌ పెట్టు” అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చారు. ఎన్టీఆర్ నుంచి ఊహించని విధంగా ఇలాంటి సమాధానం రావడంతో ఆ అభిమానితో పాటు నెటిజన్లు కూడా ఆశ్చర్యపోయారు. “అన్నా జన్మ ధన్యమైంది.. కాళ్లూ చేతులు వణుకుతున్నాయి, కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నా” అని సంతోషం వ్యక్తం చేస్తూ ఆ అభిమాని తన అపార్ట్‌మెంట్‌ అడ్రస్‌ను ఎక్స్‌లో పంచుకున్నాడు.

మరోవైపు ఇంకొక అభిమాని అదే వీడియోను ట్యాగ్ చేస్తూ.. “బిర్యానీ, నాటుకోడి వండే మన టైగర్ ఏంటి ఇలా కుకీలు చేస్తున్నాడు?” అని అడగగా, దానికి కూడా ఎన్టీఆర్ స్పందిస్తూ.. ‘బాద్‌షా’ సినిమాలోని బ్రహ్మానందం డైలాగ్ “మారాయ్.. అన్నీ మారాయ్” అనే వీడియోను రిప్లైగా పెట్టారు. ఇలా ఎన్టీఆర్ వరుసగా ఫన్నీ మీమ్స్‌తో అభిమానులకు సమాధానాలు ఇవ్వడం సోషల్ మీడియాలో ప్రస్తుతం నవ్వులు పూయిస్తోంది.

సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ‘డ్రాగన్’ అనే భారీ యాక్షన్ సినిమాను చేస్తున్నారు. ఇటీవలే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా గ్లింప్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.