పెద్ది వివాదాస్పద సన్నివేశాలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు సానా

Peddi Director Breaks Silence on Controversial Scenes

రామ్ చ‌ర‌ణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై, ముఖ్యంగా మహిళా పాత్రల చిత్రణపై సోషల్ మీడియాలో ప్రేక్షకుల నుంచి కొన్ని అభ్యంతరాలు, ప్రతికూల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనిపై దర్శకుడు బుచ్చిబాబు ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా స్పందిస్తూ ఒక సుదీర్ఘమైన వివరణ ఇస్తూ క్షమాపణలు చెప్పారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సినిమా విడుదలైన తర్వాత కొన్ని సన్నివేశాలపై ప్రేక్షకుల నుంచి వచ్చిన నెగిటివ్ ఫీడ్‌బ్యాక్‌ను తాము చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు బుచ్చిబాబు తెలిపారు. ఒక ఫిలిం మేకర్ గా  ప్రేక్షకులను అలరించడం, వారిలో స్ఫూర్తి నింపడమే సినిమా ముఖ్య ఉద్దేశమని, ఎవరినీ అసౌకర్యానికి గురిచేయాలని లేదా అగౌరవపరచాలని తాను ఎప్పుడూ అనుకోలేదని స్పష్టం చేశారు. తెరపైన, నిజ జీవితంలోనూ మహిళలంటే తనకు అపారమైన గౌరవం ఉందని పేర్కొన్నారు. ఒకవేళ ‘పెద్ది’ సినిమాలో చూపించిన కొన్ని దృశ్యాలు ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని ఆయన రాసుకొచ్చారు.

ప్రేక్షకుల నుంచి వచ్చిన అభిప్రాయాలను సమీక్షించిన తర్వాత, వివాదాస్పదంగా మారిన కొన్ని సీన్లు కట్ చేయాలని చిత్రబృందం నిర్ణయించుకున్నట్లు బుచ్చిబాబు వెల్లడించారు. సినిమా ఎదగాలన్నా, విజయవంతం కావాలన్నా ప్రేక్షకుల మద్దతు ఎంతో అవసరమని, కథలు చెప్పే దర్శకులుగా సమాజంలో వస్తున్న మార్పులను, సున్నితమైన అంశాలను గౌరవించడం తమ బాధ్యతని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో కూడా మహిళల పాత్రలను మరింత శక్తివంతంగా, గౌరవప్రదంగా చూపించే కథలనే చెప్పేందుకు కట్టుబడి ఉంటానని, ప్రతి మహిళా ఎంతో విలువైనదని బుచ్చిబాబు స్పష్టం చేశారు. తమ తప్పులను ఎత్తిచూపుతూ నిజాయితీగా అభిప్రాయాలను పంచుకున్న ప్రేక్షకులందరికీ ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.