మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో సంచలన విజయాన్ని సాధించింది. అన్ని ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘బాక్సాఫీస్ ఛాంపియన్’ సక్సెస్ ప్రెస్ మీట్‌ను నిర్వహించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ఇన్నాళ్లు మనం ఎదురుచూసిన ‘పెద్ది’ వచ్చేసింది. మనం ఊహించినట్లుగానే ఇది ఒక సైక్లోన్ క్రియేట్ చేసింది. ప్రీమియర్స్ నుంచే అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రీమియర్స్, ఫస్ట్ డే కలిపి రామ్ చరణ్ గారి కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించింది. ప్రతి సెంటర్ నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అద్భుతమైన అదే ఊపు కనిపిస్తోంది. శనివారం, ఆదివారం కలెక్షన్లు మరింత భారీగా ఉంటాయని భావిస్తున్నాం. మేము సినిమాపై ఎంత నమ్మకం పెట్టుకున్నామో, అదే స్థాయిలో ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. సినిమాను ఆదరించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఇది ఖచ్చితంగా థియేటర్లలో చూసి ఆస్వాదించాల్సిన సినిమా.
వచ్చే వారం మేమే షాక్ అయ్యే నెంబర్లతో మీ ముందుకు వస్తాం. బుచ్చిబాబు రాసిన కథకు మా హీరో రామ్ చరణ్ గారు ఎక్స్‌ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆయన నటన గురించే మాట్లాడుకుంటున్నారు. చరణ్ గారి పెర్ఫార్మెన్స్ ‘నా భూతో న భవిష్యత్’. మిగతా ఆర్టిస్టులందరూ కూడా అద్భుతంగా నటించారు. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు చూడని విధంగా మల్టిపుల్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన సినిమా ఇది. ఇందులో గొప్ప ఇన్‌స్పిరేషన్ కూడా ఉంది. ముఖ్యంగా పిల్లలకు ఈ సినిమా ఎంతో ఉపయోగపడుతుంది. అందరూ కుటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలని కోరుకుంటున్నాం. ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్లతో చాలా ఆనందంగా ఉన్నాం. రాబోయే రోజుల్లో మరింత గొప్ప విజయాన్ని అందుకుంటుందని నమ్ముతున్నాం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























