గుండెలకు హత్తుకునేలా ఇరుముడి గ్లింప్స్

Heart-Touching Glimpse from Irumudi Released

మాస్ మహారాజా రవితేజ, ఫ్యామిలీ ఎమోషన్స్ స్పెషలిస్ట్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఇరుముడి’ . శబరిమల అయ్యప్ప స్వామి నేపథ్యంతో పాటు పవర్‌ఫుల్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన మోస్ట్ అవేటెడ్ అఫీషియల్ గ్లింప్స్ ‘ది హార్ట్ ఆఫ్ ఇరుముడి’ నేడు విడుదలైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కథలోని అసలు సిసలైన ఆత్మను, సినిమాలో హైలైట్ కాబోయే బలమైన బంధాన్ని పరిచయం చేస్తూ కట్ చేసిన ఈ గ్లింప్స్ ప్రేక్షకులను, విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఈ సినిమాను డిఫైన్ చేసే ఒక బలమైన రిలేషన్షిప్ చుట్టూ ఈ గ్లింప్స్ సాగింది. కేవలం యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా శివ నిర్వాణ మార్క్ హృదయానికి హత్తుకునే కుటుంబ బంధాలు, ఎమోషన్స్ ఈ చిత్రంలో ప్రధాన హైలైట్‌గా ఉండబోతున్నాయని గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది.

మాస్ మహారాజా రవితేజను దర్శకుడు శివ నిర్వాణ ఒక ఇంటెన్స్ మరియు ఎమోషనల్ రోల్‌లో ప్రెజెంట్ చేసిన విధానం అద్భుతంగా ఉంది. ఆయన లుక్, క్యారెక్టరైజేషన్ సరికొత్త అనుభూతిని ఇస్తున్నాయి.

వర్సటైల్ కంపోజర్ జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ గ్లింప్స్‌కు ప్రాణంగా నిలిచింది. విజువల్స్‌లోని ఎమోషన్‌ను తన అద్భుతమైన బిజిఎంతో ఆయన నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లారు.విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ, సాహి సురేష్ ఆర్ట్ వర్క్ సినిమా రిచ్‌నెస్‌ను ప్రతిబింబిస్తున్నాయి.

ఈ చిత్రంలో రవితేజ సరసన టాలెంటెడ్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే సీనియర్ నటుడు సాయి కుమార్ , చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర అత్యంత ప్రాధాన్యత కలిగిన పాత్రల్లో కనిపించబోతున్నారు.

భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ నిర్మాణ భాగస్వామ్యంతో టి-సిరీస్ మరియు మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తాజాగా విడుదలైన ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.