గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘పెద్ది’. జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో.. నిన్న విజయవాడలో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ అభిమానుల కోలాహలంతో ఊగిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ వేడుకలో దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడిన మాటలు, ఆయన వ్యక్తపరిచిన ఎమోషన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ నటనపై మరియు సినిమా అవుట్‌పుట్‌పై ఆయన చెప్పిన విషయాలు సినిమాపై అంచనాలను స్కై హైకి తీసుకెళ్లాయి.నా మొదటి సినిమా ఉప్పెనకు 25కోట్ల బడ్జెట్ అవుతే పెద్దికి 350కోట్లు అయ్యింది. నేను ఈసినిమాను జాగ్రత్తగా చేసానని అనుకుంటున్నాను.
పెద్ది అనేది కేవలం ఒక కమర్షియల్ యాక్షన్ సినిమా కాదు. ఇదొక అద్భుతమైన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. ముఖ్యంగా ఈ సినిమా సెకండాఫ్‌లో వచ్చే చివరి 40 నిమిషాలు థియేటర్లలో ఉన్న ప్రతి ఒక్కరినీ ఏడిపిస్తాయి. ప్రతి ప్రేక్షకుడు గుండె బరువెక్కి కన్నీళ్లు పెట్టుకుంటారు” అంటూ ఎమోషనల్ అయ్యారు.
రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్, నటన గురించి చెబుతూ.. ఆ చివరి 40 నిమిషాల ఎపిసోడ్స్‌లో చరణ్ గారి నటన ఒక విశ్వరూపంలా ఉంటుంది. ఇప్పటినుంచి పదేళ్ల తర్వాత ఎవరైనా నన్ను ‘పెద్ది’ సినిమా గురించి అడిగినా.. నా నోట వెంట వచ్చే ఒకే ఒక్క పేరు రామ్ చరణ్. ఆయన ఈ పాత్రలో జీవించేశారు” అని కొనియాడారు.
తనను దర్శకుడిగా పరిచయం చేసి, ఈ స్థాయికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన తన గురువు, స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ను బుచ్చిబాబు ఈ వేదికపై ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























