ఆకట్టుకున్న కొత్త మలుపు టీజర్

Kotha Malupu Teaser out now

టాలీవుడ్‌లో సరికొత్త లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను ఇష్టపడే ప్రేక్షకులను అలరించేందుకు ఒక ఆసక్తికరమైన చిత్రం సిద్ధమవుతోంది. ఆకాష్, భైరవి దేకా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘కొత్త మలుపు’. తాతస్తు క్రియేషన్స్, భైరవి ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శివ వరప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మోస్ట్ అవేటెడ్ అఫీషియల్ టీజర్ విడుదలైంది. ఇక ఈ టీజర్ సినిమాపై మంచి పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేస్తోంది.హీరో ఆకాష్, హీరోయిన్ భైరవి దేకాల మధ్య కెమిస్ట్రీ చాలా నేచురల్‌గా, ప్యూర్ లవ్ స్టోరీని ప్రతిబింబించేలా ఉంది. ప్రేమతో పాటు కుటుంబ బంధాల చుట్టూ తిరిగే ఎమోషన్స్ గుండెకు హత్తుకునేలా కనిపిస్తున్నాయి.

సినిమాలో వినోదానికి కొదవలేదని టీజర్ చూస్తేనే అర్థమవుతోంది. టాలీవుడ్ సీనియర్ కామెడీ కింగ్స్ రఘుబాబు, పృథ్వి (30 ఇయర్స్ పృథ్వి) తమ మార్క్ హిలేరియస్ టైమింగ్‌తో నవ్వులు పూయించారు.

‘చౌరస్తా’ బ్యాండ్ ఫేమ్ యశ్వంత్ నాగ్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. టీజర్‌లో వినిపించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విజువల్స్‌కు పర్‌ఫెక్ట్ ఫీల్‌ను యాడ్ చేసింది.

టి. బాలకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభావతి, మహేందర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సరికొత్త మలుపులతో సాగే ఒక అందమైన ప్రేమకథను, అంతే అందమైన ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ కామెడీతో దర్శకుడు శివ వరప్రసాద్ చాలా చక్కగా తెరకెక్కించినట్లు టీజర్ ద్వారా స్పష్టమవుతోంది.త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ను చెప్పనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.