1 నేనొక్కడినే సినిమాను టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టింది అందులోని టెక్నికల్ వాల్యూస్. దర్శకుడు సుకుమార్ రాసుకున్న హరిప్రసాద్ జక్కా కథ, దానికి ఆయన అల్లిన గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే తెలుగు స్క్రీన్‌పై అంతకుముందెన్నడూ చూడనివి. ఒక సీన్ నిజమా లేక హీరో ఊహించుకుంటున్నాడా అనే సస్పెన్స్‌ను చివరి వరకు మెయింటైన్ చేయడం సుకుమార్ మేధస్సుకు నిదర్శనం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాకు మరో మేజర్ పిల్లర్ సినిమాటోగ్రాఫర్ ఆర్. రత్నవేలు. లండన్, బెల్ఫాస్ట్ నగరాల్లో ఆయన తీసిన విజువల్స్, కలర్ ప్యాలెట్ అచ్చం ఒక హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్‌ను తలపిస్తాయి. పీటర్ హెయిన్ కొరియోగ్రఫీ చేసిన గోవా బైక్ ఛేజింగ్ సీక్వెన్స్, లండన్ కార్ ఛేజింగ్ సీన్లు ఇప్పటికీ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ బ్లాక్స్.
ఇప్పుడు ఈ విజువల్స్ అన్నీ 4K అప్‌గ్రేడ్‌తో బిగ్ స్క్రీన్‌పై సరికొత్త అనుభూతిని ఇవ్వనున్నాయి.ఈనెల 31న దివంగత లెజండరీ హీరో కృష్ణ జయంతి సందర్బంగా 1 నేనొక్కడినే మళ్ళీ థియేటర్లలో రచ్చ చేయనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























