ప్రేమ కథలైనా, ఊరమాస్ యాక్షన్ సినిమాలైనా, భక్తిరస పాత్రలైనా.. ప్రతిదానిలోనూ తనదైన ప్రయోగాలతో ప్రేక్షకుల మనసుల్లో ‘గ్రీకువీరుడు’, ‘మన్మథుడు’గా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున . ఈరోజు ఆయన సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి విజయవంతంగా 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియాలో ఎంతో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. తన జీవితంలో మే 23వ తేదీ ఎప్పటికీ చాలా స్పెషల్ అని పేర్కొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సరిగ్గా 40 ఏళ్ల క్రితం (1986) ఇదే రోజున నాగార్జున హీరోగా పరిచయమైన మొదటి చిత్రం ‘విక్రమ్’ విడుదలైంది. మిమ్మల్ని అలరించడం కోసం, మీ ప్రేమాభిమానాలు పొందడం కోసమే నేను ఇండస్ట్రీకి వచ్చానని, ‘విక్రమ్’ సినిమా తనకు ఎంతోమంది అభిమానులను దగ్గర చేసిందని నాగ్ పేర్కొన్నారు.
అక్కినేని లెజెండ్, నాగార్జున తండ్రి అయిన దివంగత అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రం ‘మనం’ (2014) కూడా ఇదే రోజున విడుదలైంది. నాన్నతో పాటు కొడుకులు నాగచైతన్య, అఖిల్‌లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అరుదైన అవకాశం ఈ సినిమాతోనే దక్కిందని ఆయన గుర్తుచేసుకున్నారు.
“ఈ 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా, నన్ను ఎల్లప్పుడూ గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్న నా అభిమానులకు, ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇన్నేళ్లుగా నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అంటూ నాగార్జున సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం నాగార్జున తన కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 100వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























