‘కాంతార ఛాప్టర్ 1, ఎన్టీఆర్ ‘డ్రాగన్’ వంటి క్రేజీ పాన్ ఇండియా సినిమాలతో టాలీవుడ్ మరియు సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న హోమ్లీ బ్యూటీ రుక్మిణి వసంత్ కు సంబంధించిన ఒక అంశం నెట్టింట తీవ్ర కలకలం రేపుతోంది. స్విమ్మింగ్ పూల్ వద్ద ఆమె గ్రీన్ కలర్ బికినీ ధరించి ఫొటోషూట్ చేసినట్లు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు, వీడియో క్లిప్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీనిపై రుక్మిణి వసంత్ అధికారికంగా స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ వివాదంపై రుక్మిణి వసంత్ స్పందిస్తూ ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. “గత కొన్ని రోజులుగా నావి అంటూ సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న బికినీ విజువల్స్ అన్నీ అబద్ధం. అవి ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – AI) సాయంతో క్రియేట్ చేసిన ఫేక్ డీప్‌ఫేక్ కంటెంట్ అని స్పష్టం చేయదలుచుకున్నా. కేవలం వ్యూస్ కోసం ఇలా తప్పుడు చిత్రాలు, సమాచారం క్రియేట్ చేయడం నిజంగా బాధ్యతారాహిత్యం. అంతేకాదు, ఇది ఒక మహిళగా నా వ్యక్తిగత గోప్యతను పూర్తిగా ఉల్లంఘించడమే అవుతుంది” అని ఆమె మండిపడ్డారు.
ఈ వ్యవహారాన్ని తను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నట్లు రుక్మిణి తెలిపారు. ఈ ఫేక్ ఫొటోలు, వీడియోలను క్రియేట్ చేసిన వారితో పాటు.. వీటిని సోషల్ మీడియా వేదికగా కావాలనే వైరల్ చేస్తున్న వారిపై కూడా న్యాయపరంగా, సైబర్ క్రైమ్ ద్వారా కఠిన చర్యలు తీసుకోవడానికి ఇప్పటికే లీగల్ ప్రాసెస్ ప్రారంభించినట్లు ఆమె హెచ్చరించారు.
ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోవడంతో సెలబ్రిటీల ముఖాలను మార్ఫింగ్ చేస్తూ ఏఐ డీప్‌ఫేక్ వీడియోలను సృష్టించడం హీరోయిన్లకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ తప్పుడు ప్రచారానికి రుక్మిణి వసంత్ లీగల్ యాక్షన్‌తో గట్టి చెక్ పెట్టాలని డిసైడ్ అవ్వడంతో అభిమానులు ఆమెకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























