సూపర్‌స్టార్ మహేశ్ బాబు, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన టాలీవుడ్ కల్ట్ క్లాసిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘1 నేనొక్కడినే’. ఈ సినిమాను మే 31న సూపర్‌స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా 4K క్వాలిటీతో సరికొత్తగా థియేటర్లలో రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఈ చిత్ర రీ-రిలీజ్ ట్రైలర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ లభిస్తోంది.ట్రైలర్ యూట్యూబ్‌లోకి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే రికార్డ్ వ్యూస్‌తో ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
2014లో విడుదలైన ఈ చిత్రం హాలీవుడ్ రేంజ్ మేకింగ్, మైండ్ బెండింగ్ స్క్రీన్‌ప్లేతో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. రిలీజ్అయ్యాక కొందరు ఈ మాస్టర్ పీస్‌ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినా.. కాలక్రమేణా ఇది తెలుగు సినిమా చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోయింది. ఇప్పుడు రీ-రిలీజ్ ట్రైలర్ లోని 4K అల్ట్రా హెచ్‌డీ విజువల్స్ చూస్తుంటే, థియేటర్లలో ఈసారి ఫ్యాన్స్‌కు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ ట్రైలర్‌కు మేజర్ హైలైట్‌గా నిలిచింది. సరికొత్త క్వాలిటీతో వినబడుతున్న థంపింగ్ మ్యూజిక్, మహేశ్ బాబు ఇంటెన్స్ యాక్షన్ సీన్స్, గూస్‌బంప్స్ తెప్పించే సైకలాజికల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా “గౌతమ్ ఈజ్ బ్యాక్.. థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం” అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
మే 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రీ-రిలీజ్ కాబోతున్న ‘1 నేనొక్కడినే’.. బాక్సాఫీస్ వద్ద రీ-రిలీజ్ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























