బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద రూ. 1,300 కోట్లకు పైగా వసూళ్లతో సంచలనం సృష్టించగా ఆ తరువాత ఓటీటీలోనూ అదే రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే ఈసినిమా అన్ కట్ వెర్షన్ పేరుతో మళ్ళీ ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా మొదటి భాగానికి సంబంధించిన సరికొత్త అన్‌కట్ (సెన్సార్ చేయని) వర్షన్ ‘రా అండ్ అన్దేఖా’ రేపటి నుండి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేయనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్ ఇండియాతో పాటు జియో హాట్‌స్టార్ సంస్థలు అధికారిక ప్రకటనలు విడుదల చేశాయి.ఈ ఓటీటీ రిలీజ్లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ‘ధురంధర్’ మొదటి భాగం ‘రా అండ్ అన్దేఖా’ ఎడిషన్ ఒకే సమయంలో అటు నెట్‌ఫ్లిక్స్ ఇటు జియో హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లలో రేపటి నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ అందుబాటులోకి రాబోతోంది.
థియేట్రికల్ రిలీజ్ సమయంలో సెన్సార్ బోర్డ్ కట్ చేసిన కొన్ని కీలకమైన యాక్షన్ బ్లాక్స్, తీవ్రమైన హింసాత్మక సన్నివేశాలు మరియు సెన్సార్ లేని పవర్ఫుల్ రా డైలాగులను ఈ ‘ఉన్దేఖా’ వర్షన్లో వీక్షించవచ్చు.
ఇక భారతీయ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సీక్వెల్ చిత్రం ‘ధురంధర్ 2’ డిజిటల్ స్ట్రీమింగ్ షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేవు. ఈ రెండవ భాగం ముందుగా నిర్ణయించినట్లుగానే జూన్ 4, 2026న భారతదేశంలో జియో హాట్‌స్టార్ వేదికగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























