దేవుడు నాకొక గొప్ప వరం ఇచ్చాడు

NTR’s Dragon Glimpse Released

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం రాత్రి ఎన్టీఆర్ నీల్ సినిమా పవర్‌ఫుల్ ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదలైంది. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు.ఇక గ్లింప్స్ అయితే ఊహించని విధంగా వుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“దేవుడు నాకొక గొప్ప వరం ఇచ్చాడు… ట్రిగ్గర్‌ నొక్కగానే మరిచిపోవడం. నిదరపోయినప్పుడు నా కల్లోకి నేను చంపినవాళ్ల ముఖాలు రావు, మిగిలివున్న శత్రువుల ముఖాలే కనపడతాయి. పొరపాటున కూడా నా కల్లోకి రావొద్దు….”అని గ్లింప్స్‌లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి:

గ్లింప్స్ ప్రారంభంలో భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు కాటన్, స్టీల్, స్పైసెస్ కోసం వచ్చారని.. కానీ 250 ఏళ్లు ఇక్కడే ఉండిపోవడానికి కారణం ప్రపంచంలోనే అత్యంత వ్యసనకారక పదార్థమైన హెరాయిన్‌ను తయారు చేసే ‘ఓపియమ్ పాపి’ అనే మొక్కేనని చూపించారు. ఈ మొక్క హెరాయిన్ కంటే ఎక్కువ మంది విలన్లనే తయారు చేసిందని చెబుతూ, ఇది విలన్ల కథ అని టీజర్ స్పష్టం చేస్తోంది.

గ్లింప్స్‌లో ఎన్టీఆర్ రక్తపాతం సృష్టించే ఒక అత్యంత శక్తిమంతమైన పాత్రలో కనిపించారు. ప్రశాంత్ నీల్ మార్క్ విజువల్స్ ఒక ప్రత్యేకమైన రగ్గడ్ కథా ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నాయి.

‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాలతో పాన్-ఇండియా స్థాయిలో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న తదుపరి భారీ చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్, మరియు టీ సిరీస్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక ‘డ్రాగన్’ గ్లింప్స్‌తో ఎన్టీఆర్ అభిమానులకు పర్ఫెక్ట్ బర్త్‌డే ట్రీట్ లభించింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.