యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ సమ్మర్ బ్లాక్ బస్టర్ ‘గోదారి గట్టుపైన. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించారు. మే 8న వరల్డ్‌వైడ్ రిలీజ్ అయిన ఈ చిత్రం సమ్మర్ కూల్ ఎంటర్టైనర్ గా అలరించి థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్స్ మీట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
డైరెక్టర్ సుభాష్ చంద్ర మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సచిన్ టెండూల్కర్ గారు ఒక మంచి మాట అన్నారు… ‘ఎవరైనా రాళ్లు విసిరితే, ఆ రాళ్లతోనే మైయిలురాయి చేసుకోండి ’ అని. ‘గోదారి గట్టుపైన’ మాకు అలాంటి మైలు రాయి. 10 రోజుల్లో 8.6 కోట్ల గ్రాస్ సాధించడం మాకు చాలా గొప్ప విషయం. ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు నమస్కరిస్తున్నాను. ఇది పూర్తిగా ప్రేక్షకుల వల్లే సాధ్యమైంది. మనుషులందరూ మంచివాళ్లే. కానీ పరిస్థితుల వల్ల వారి ప్రవర్తన మారుతుంది. అదే విషయాన్ని ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాను.
సినిమా అనేది పవర్‌ఫుల్ మీడియం. దాని ద్వారా మంచి చెప్పాలనేదే నా ఉద్దేశం. అందుకు మా ఆర్టిస్టులు అందరూ అద్భుతంగా సహకరించారు. ఇందులో కనిపించే పాత్రలు మన సమాజంలో చూసినట్లుగానే ఉంటాయి. అందుకే ప్రేక్షకులు బాగా రిలేట్ అవుతున్నారు. ఈ విజయం ప్రజలది. జనం ఈ సినిమాను నిలబెట్టారు. థియేటర్లకు వెళ్లినప్పుడు అక్కడ కనిపించిన కుటుంబాలు మాకు నిజమైన పండగలా అనిపించాయి. ఫస్ట్ డే వచ్చిన మిక్స్‌డ్ రివ్యూస్ సమయంలో నిర్మాత గారు మాకు ఎంతో ధైర్యం ఇచ్చారు. ‘మనం మంచి సినిమా తీశాం… మంచి జరుగుతుంది’ అని నమ్మకం కల్పించారు. ఆ నమ్మకం నిజం అయ్యింది. ఈ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























