మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. ప్రతి ప్రోమో దేశవ్యాప్తంగా బజ్ క్రియేట్ చేసింది. దర్శకుడు బుచ్చి బాబు సానా ఈ రూరల్ యాక్షన్-స్పోర్ట్స్ కథను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆకట్టుకునే ఫస్ట్-లుక్ పోస్టర్లు, పాత్రల గ్లింప్స్‌లు, పాటలు ఈ చిత్రంపై అంచనాలను మరింత పెంచాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రాన్ని, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ముంబైలో జరిగిన ఈవెంట్ లో లాంచ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. నా రెండో సినిమాకే ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన రామ్ చరణ్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఆయనకు చాలా గాయాలు అయ్యాయి. కానీ అవన్నీ లెక్క చేయలేదు. జాన్వి గారు చాలా హార్డ్‌వర్కింగ్. తప్పకుండా వారి అమ్మగారి స్థాయికి వెళ్తారని కోరుకుంటున్నాను. రెహమాన్ గారితో పని చేయడం నా డ్రీమ్. నిన్ననే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విన్నాను. ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది. ఇంకా సెకండ్ హాఫ్ వినాలి. దివ్యేందు మా టీమ్‌లో కలిసిపోయి చాలా దగ్గరయ్యారు. రత్నవేలు గారు నా సినిమాకు లైఫ్ ఇచ్చారు. మా నిర్మాత సతీష్ గారికి హ్యాపీ బర్త్‌డే. థ్యాంక్యూ ఇండియా, థ్యాంక్యూ ముంబై.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























